సూపర్ ఓవర్‌లో భారత్ A ఓటమి.. మ్యాచ్ ముగిశాక కొట్టుకున్న ప్లేయర్స్!

సూపర్ ఓవర్‌లో భారత్ A ఓటమి.. మ్యాచ్ ముగిశాక కొట్టుకున్న ప్లేయర్స్!

India A vs Sri Lanka A: శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఈరోజు (సోమవారం) దంబుల్లాలో భారత్ A వర్సెస్ శ్రీలంక A జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌ టై కావడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. అయితే సూపర్ ఓవర్‌లో లంక జట్టు విజయం సాధించగా, మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోనే ఘర్షణకు దిగడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

10 పరుగుల పెనాల్టీ షాక్:
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన భారత్ A జట్టు 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో సూర్యాంశ్ షెడ్జ్ (72 రన్స్), విప్రాజ్ నిగమ్ (51 రన్స్) రాణించారు. ఈ ఇన్నింగ్స్ సమయంలో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. భారత ప్లేయర్ విప్రాజ్ నిగమ్ రూల్స్ కి విరుద్ధంగా పిచ్‌పైకి రెండుసార్లు నడుచుకుంటూ వెళ్లడంతో అంపైర్లు భారత్‌కు 10 పరుగుల పెనాల్టీ (Penalty Runs) విధించారు. దాంతో ఆ 10 పరుగులు శ్రీలంక స్కోరు బోర్డుకు అదనంగా కలిశాయి.

లంక ఇన్నింగ్స్ టై.. సూపర్ ఓవర్ రచ్చ: 
266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక A జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి సరిగ్గా 265 పరుగులు చేసింది. లంక బ్యాటర్ సదీర సమరవిక్రమ 93 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇరు జట్ల స్కోర్లు సమం (Tie) కావడంతో కాసేపు గందరగోళం నెలకొంది. ఆ తర్వాత విజేతను తేల్చడానికి అంపైర్లు సూపర్ ఓవర్ ప్రకటించారు.

కెప్టెన్ తిలక్ వర్మ ఫైర్.. నో బాల్ డ్రామా: 
సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక A జట్టు 16 రన్స్ చేసింది. అయితే లంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక వివాదాస్పద నో బాల్ (No-Ball Drama) నిర్ణయంపై భారత కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో తీవ్రంగా వాదించాడు. అంపైర్ నిర్ణయం పట్ల తిలక్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక శ్రీలంక విధించిన 17 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ తరఫున వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్జ్ సూపర్ ఓవర్ బరిలోకి దిగారు. కానీ లంక బౌలింగ్‌ను ఎదుర్కోలేక వారు ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. దీంతో శ్రీలంక సూపర్ ఓవర్‌లో ఘన విజయం సాధించింది.

కొట్టుకున్న భారత్, శ్రీలంక ప్లేయర్స్: 
మ్యాచ్ ముగిసిన వెంటనే పరిస్థితి మరింత దారుణంగా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక A జట్టు ఆటగాడితో మైదానంలోనే నేరుగా ఘర్షణకు (Post-match clash) దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ జరగడంతో అంపైర్లు ఇరు జట్ల ఆటగాళ్లని మైదానం బయటకి పంపించారు. ఒకే మ్యాచ్‌లో పెనాల్టీలు, నో బాల్ వివాదాలు, ఆటగాళ్ల కొట్లాటలు జరగడం చూసి ఫ్యాన్స్ ఇదేం మ్యాచ్ రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.