టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూట్ మార్చింది. కమర్షియల్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి.. కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపేందుకు రెడీ అయింది. సామ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ 'మా ఇంటి బంగారం'. డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ జూన్ 19న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. అయితే, ప్రమోషన్స్‌లో భాగంగా సమంత తన కెరీర్, స్టార్‌డమ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఆ స్టార్‌డమ్ ఒక అడిక్షన్..
తన గత సినీ ప్రయాణంపై సమంత స్పందిస్తూ.. నేను గర్వంగా చెప్పుకోలేని ఎన్నో సినిమాల్లో నటించాను. కెరీర్ స్టార్టింగ్‌లో చాలా తక్కువ టైంలోనే జనాలు నన్ను నెత్తిన పెట్టేసుకున్నారు. థియేటర్లలో నా పేరు వింటే కేకలు వేయడం, నా సినిమాల కోసం వెయిట్ చేయడం చూసి నేనే షాకయ్యాను. ఆ సమయంలో స్టార్‌డమ్ అనే మాయలో పడిపోయాను. అదొక అడిక్షన్ లా మారిపోయింది. మీడియా నా గురించి ఏం రాస్తోంది? ఏడాదికి నేను ఎన్ని సినిమాలు చేస్తున్నాను? అనే వాటిపైనే నా ఫోకస్ ఉండేది అని సామ్ చెప్పుకొచ్చింది. వరుస హిట్లు, బ్లాక్‌బస్టర్లు కొడుతున్నప్పటికీ.. అసలు ఒక నటిగా ఆ సినిమాకు తనేం ఇస్తున్నాననే విషయం గురించి అప్పట్లో ఎప్పుడూ ఆలోచించలేదని ఆవేదన వ్యక్తం చేసింది..
లేడీ 'బాషా'.. కథతో..
గతంలో సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన 'ఓ బేబీ' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు రాబోతున్న 'మా ఇంటి బంగారం' అంతకుమించి ఉండబోతుందని ధీమా వ్యక్తం చేస్తుంది సామ్. సూపర్ స్టార్ రజనీకాంత్ క్లాసిక్ హిట్ 'బాషా' తరహాలోనే ఈ సినిమా లైన్ ఉంటుందని ఇండస్ట్రీ నందినీ రెడ్డి తెలిపింది.
కథేంటంటే?
పెళ్లయ్యాక పల్లెటూరికి కోడలిగా వెళ్లిన ఒక అమాయకపు గృహిణిగా సమంత కనిపిస్తుంది. అయితే ఆ ఊరిలో ఎదురైన కొన్ని పరిస్థితుల వల్ల ఆమె ఉగ్రరూపం దాల్చాల్సి వస్తుంది. అసలు సమంత ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? ఆమె వెనుక ఉన్న వీరవనిత ఎవరు? అనే కోణంలో సినిమా సాగుతుంది. గృహిణిగా హోమ్లీగా కనిపిస్తూనే.. యాక్షన్ సీన్స్‌లో సమంత చూపించిన రౌద్రరూపం థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది..
సొంత ప్రొడక్షన్ తో..
ఈ సినిమాకు సమంత భర్త, బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు రాజ్ నిడిమోర్ స్వయంగా ఈ క్రేజీ కథను అందించారు. సమంత తన సొంత బ్యానర్ 'ట్రాలాలా పిక్చర్స్'(Tralala Pictures) పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలవనుంది. మరి ఈ జూన్ 19న సమంత 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో చూడాలి.
