స్టూడెంట్స్ వద్ద డ్రగ్స్ స్వాధీనం

స్టూడెంట్స్ వద్ద డ్రగ్స్ స్వాధీనం

జీడిమెట్ల, వెలుగు : ఇద్దరు స్టూడెంట్ల వద్ద డ్రగ్స్ దొరికిన ఘటన జగద్గిరిగుట్ట పరిధిలో జరిగింది. మాదాపూర్​ఎస్ వోటీ , జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన ప్రకారం.. ఉత్తరాఖండ్​కి చెందిన తిలక్​శివ(22) జగద్గిరిగుట్ట పరిధి షిరిడి హిల్స్​లో ఉంటూ కొంపల్లిలోని శివశివాని కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు.  విజయవాడకు చెందిన జూలపల్లి అశిల్​శివ గోపన్​పల్లి పరిధి తెల్లాపూర్​లో ఉంటూ అలగప్ప యూనివర్సిటీలో బీబీఏ 3వ ఏడాది చదువుతున్నాడు.

 సమాచారం మేరకు జగద్గిరిగుట్ట సీఐ బాలకృష్ణ వెళ్లి హైస్కూల్​ వద్ద ఇద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద 3 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 45 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా విజయవాడకు చెందిన రోహిత్ ​సిటీకి వచ్చి డ్రగ్​సప్లయ్​ చేశాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.