హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరిగే మున్సి పల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారానికి దిగనున్నారు. ఈ నెల7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
మంగళవారం పవన్ కల్యాణ్‌ను ఆయన నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై నేతలు చర్చించారు. తెలంగాణలో బీజేపీకి జనసేన పూర్తి మద్దతు ఇస్తుందని పవన్ కల్యాణ్ వారికి తెలిపారు.
