మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్‌లో 32 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే మురళీనాయక్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం డీసీసీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో సర్వే చేసి అర్హులైన అభ్యర్థులకు కాంగ్రెస్ తరఫున బీ ఫామ్‌లను అందజేశామని తెలిపారు.
సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి మున్సిపాలిటీ అభివృద్ధి చేపడతామని, ఇప్పటి వరకు మహబూబాబాద్‌లో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని ప్రజలను కోరారు. మున్సిపాలిటీలో రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందులో రూ.20కోట్లతో తాగునీటి కోసం, రూ. 60 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులకు కేటాయించామని వివరించారు. ప్రెస్మీట్లో డీసీసీ అధ్యక్షురాలు ఉమామురళీనాయక్, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
