జనగామ అర్బన్, వెలుగు : మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జనరల్ అబ్జర్వర్ ఎ.నర్సింహా రెడ్డి అన్నారు. జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నామినేషన్ ఉపసంహరణ కేంద్రం, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్‌ను మంగళవారం సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. జనరల్ అబ్జర్వర్‌కు ఎన్నికలకు సంబందించిన ప్రస్తుత ఏర్పాట్లు అలాగే తీసుకుంటున్న చర్యలపై అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన భద్రతా చర్యలు, మెటీరియల్ నిల్వ విధానం, సీసీ కెమెరా పర్యవేక్షణ, రికార్డ్ నిర్వహణ వంటి అంశాలపై సంబంధిత అధికారులకు అబ్సర్వర్ సూచనలు ఇచ్చారు. ఆయనవెంట నోడల్ ఆఫీసర్ మాతృ నాయక్ పీడీ హౌసింగ్, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
