హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్ ఎదుట ..న్యాయం చేయాలని వివాహిత ఆందోళన

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్ ఎదుట ..న్యాయం చేయాలని వివాహిత ఆందోళన

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌, వెలుగు: తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ వివాహిత హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్ ఎదుట మంగళవారం హల్‌‌‌‌‌‌‌‌చల్‌‌‌‌‌‌‌‌ చేసింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌‌‌‌‌‌‌‌పూర్ మండలం తిగారం గ్రామానికి చెందిన పావనికి, హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కుంచపు అరవింద్‌‌‌‌‌‌‌‌తో రెండేళ్ల కింద పెండ్లయింది.

పెళ్లైన కొద్దిరోజుల నుంచే భర్త అదనపు కట్నం కోసం ఆమెను వేధిస్తున్నాడు. దీనిపై బాధితురాలు గతంలోనే పోలీసులు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. అనంతరం పెద్దమనుషుల సమక్షంలో ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్ కింద పావనికి  కొంత మొత్తం ఇచ్చేందుకు అరవింద్‌‌‌‌‌‌‌‌ అంగీకరించాడు.  కాగా ఆ డబ్బును ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని, దీనిపై పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడం లేదని ఆరోపించింది.

ఈక్రమంలో మంగళవారం తన తల్లిదండ్రులతో కలిసి పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఎదుట, అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయించింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని, తన వెంట తెచ్చుకున్న డీజిల్‌‌‌‌‌‌‌‌ మీద పోసుకుంది. అప్రమత్తమయిన పోలీసులు అడ్డుకొని స్టేషన్​కు తరలించారు.