అధికార పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి :  విప్ ఆది శ్రీనివాస్‌‌‌‌

అధికార పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి :  విప్ ఆది శ్రీనివాస్‌‌‌‌

వేములవాడ, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. మంగళవారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌‌‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 11న జరగనున్న మున్సిపల్‌‌‌‌ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని,  వేములవాడలో తాను ఎమ్మెల్యేగా ఉండడం వల్లే పట్టణం, రాజన్న ఆలయం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, మున్సిపల్‌‌‌‌లోనూ అధికార పార్టీకి చెందిన అభ్యర్థులనే గెలిపించాలన్నారు. 

నాకు ఒక చాన్స్ ఇవ్వండి 

 వేములవాడ మున్సిపల్‌‌‌‌లో అధికార కాంగ్రెస్​ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని తనకు ఒక్క చాన్స్ ఇచ్చి గెలిపించాలని 6వ వార్డు కాంగ్రెస్​ అభ్యర్థి కాస శ్రీనివాస్​ కోరారు. నాంపల్లిలో వార్డు ఆఫీస్‌‌‌‌ను ఇన్‌‌‌‌చార్జి పిల్లి కనుకయ్యతో కలిసి ప్రారంభించారు. ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్​ బలపరిచిన అభ్యర్థిగా ముందుకు వస్తున్నానని, తనను గెలిపించాలని కోరారు.