కామారెడ్డి, వెలుగు : మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా ఇటీవల బీటెక్ కంప్లీట్ చేసిన యువతి బరిలో నిలిచారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో కౌన్సిలర్‌గా కాంగ్రెస్ పార్టీ తరపున 22 ఏండ్ల రాంశెట్టి హర్షిత పోటీ చేస్తున్నారు. హర్షితకు పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం బీ -ఫారం అందించారు.
కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించిన పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, పీసీసీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ ఏలె మల్లికార్జున్ లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
