బషీర్ బాగ్, వెలుగు: ఆల్ ఇండియా ఇంటర్ ఇనిస్టిట్యూషనల్ క్యారమ్ చాంపియన్ షిప్ పోటీలు ఈ నెల 23 నుంచి 26 తేదీ వరకు నిజామాబాద్ లోని నవ్యభారతి స్కూల్లో నిర్వహిస్తున్నట్లు క్యారమ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్.మదన్ రాజ్, మీడియా కన్వీనర్ టి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం బషీర్ బాగ్ లోని ఓ హోటల్ లో ప్రెస్మీట్పెట్టి మాట్లాడారు.
యూనియన్ బ్యాంక్ ఇఫ్ ఇండియా సౌజన్యంతో తమ సంస్థ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా క్యారమ్ చాంపియన్ షిప్ ఏర్పాటు చేస్తోందన్నారు. క్యారమ్ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. 20 ప్రసిద్ధ సంస్థల నుంచి ఆరుగురు పురుషులు, ఆరుగురు మహిళలు పాల్గొంటున్నారని చెప్పారు.
