
న్యూఢిల్లీ : మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల మెట్రోకు నష్టమని.. ట్రాఫిక్, కాలుష్య సమస్యలూ పెరుగుతాయన్న ప్రధాని మోదీ కామెంట్లపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘‘ప్రధాని, కేంద్ర మంత్రులు ఉచితంగా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. మహిళలకు మాత్రం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించవద్దా?” అని ప్రశ్నిస్తూ ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. మోదీ ఇంటర్వ్యూలోని ఓ క్లిప్ ను కూడా కేజ్రీవాల్ షేర్ చేశారు. ‘‘దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని మహిళలు కోరుకుంటున్నారు.. కానీ ప్రధాని మాత్రం దీనిని రద్దు చేయాలని అంటున్నారు” అని విమర్శించారు.