చాలా ఏళ్లుగా మధ్యంపై నిషేధం అమలుచేస్తూ వస్తున్న పాకిస్తాన్.. లేటెస్ట్ గా తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చాలా పాత బ్రాండ్ మందుపై ఉన్న 50 ఏళ్ల నిషేదాన్ని ఎత్తివేస్తూ పాక్ డెసిషన్ తీసుకోవడంపై చర్చ నడుస్తోంది. ఎందుకు పాక్.. మధ్యంపై బ్యాన్ ఎత్తేస్తోంది.. దీని వెనుక ఉన్న ప్లానేంటో తెలియాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే.
పాకిస్తాన్ లో మద్యం అమ్మకంపై నిషేధం ఉంది. కేవలం నాన్ ముల్సిం మైనారిటీలకే ఆల్కహాల్ అమ్మేందుకు పర్మిషన్ ఉంది. ఈ క్రమంలో దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత.. అంటే 50 ఏండ్ల తర్వాత ఓల్డెస్ట్ మద్యం బ్రాండ్ అయిన ముర్రే బ్రీవరీ (Murree Brewery) ఎగుమతులకు అనుమతి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం.
ముర్రే బ్రీవరీ బ్రాండ్ బ్రిటిష్ పాలనలో 1860లో ప్రారంభించారు. చాలా రోజుల నిషేధం తర్వాత ఇప్పుడు ఆ బ్రాండ్ ప్రొడక్ట్స్ ను విదేశాల్లో అమ్ముకునేందుకు అనుమతించారు. ఇప్పటి వరకు ఇతర దేశాలను ఎగుమతి చేసేందుకు కూడా అక్కడ అనుమతి లేదు.
►ALSO READ | ఇటలీలోని వింత గ్రామం: 30 ఏళ్ల తర్వాత మొదటిసారి బిడ్డ పుట్టడంతో పండుగ చేసుకుంటున్న గ్రామం..
ఇది 165 ఏళ్ల వ్యాపారానికి చారిత్రకంగా టర్నింగ్ పాయింట్ గా కంపెనీ భావిస్తోంది. కేవలం పాకిస్తాన్ లోని నాన్ ముస్లింలకు, విదేశీలకు మాత్రమే అమ్ముకునేందుకు అనుమతి ఉన్నప్పటికీ.. బ్రాండ్ తన ప్రాముఖ్యతను కోల్పోకుండా మనుగడ సాగిస్తోంది. కొన్ని ఏళ్ల ప్రయత్నం.. స్థిరత్వం కారణంగా నిలబడగలిగామని.. ఆ ఫలితంగానే ప్రస్తుతం కంపెనీకి పర్మిషన్ వచ్చినట్లు కంపెనీ సీఈవో ఇస్ఫన్యార్ భండారా అన్నారు.
ఈ చర్య పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది?
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నివాసానికి సమీపంలోని రావల్పిండిలో ఉన్న ముర్రీ బ్రూవరీ సంవత్సర ఆదాయం 898 కోట్లకు పైగా ఉంది. ఇందులో సగానికి పైగా ఆల్కహాల్ ఉత్పత్తుల నుండి వస్తుంది, మిగిలినది ఆల్కహాల్ లేని పానీయాలు, గాజు సీసాల తయారీ నుండి వస్తుంది.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిమితులు, ఒత్తిళ్లతో సహా సవాళ్లను ఎదుర్కొంటున్నందున, విదేశీ మారక ద్రవ్య ఆదాయాలను పెంచుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. దివాళా తీసిన ఆర్థిక వ్యవస్థను కొంత మేరకైనా గాడిలో పెట్టేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అంటున్నారు.
