హై ఓల్టేజ్ పాకిస్తాన్ మ్యాచ్ కు అభిషేక్ రెడీ.!

హై  ఓల్టేజ్ పాకిస్తాన్ మ్యాచ్ కు అభిషేక్ రెడీ.!

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దాయాది పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆదివారం జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు టీమిండియాకు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్యూస్.  అనారోగ్యంతో బాధపడుతున్న డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకున్నాడు. 

పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తను బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తెలిపాడు.‘నేను అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాట్లాడాను, అతను ఇప్పుడు ఆరోగ్యంగానే కనిపిస్తున్నాడు. ఈరోజు ప్రాక్టీస్ కూడా చేశాడు. తాను కోలుకుంటున్నట్లు, మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సిద్ధమవుతున్నట్లు చెప్పాడు’ అని వెల్లడించాడు. పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ రెండు రోజులు  హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ తీసుకున్నాడు. ఈ కారణంగానే గురువారం నమీబియాతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యడు. ఇప్పుడు అభి తుది జట్టులోకి తిరిగొస్తే గత పోరులో ఓపెనింగ్ చేసిన సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మళ్లీ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైకి వెళ్లాల్సి ఉంటుంది.