బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ భారీ విజయం: తారిక్ రెహమాన్‌కు ప్రధాని మోదీ అభినందనలు..

బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ భారీ విజయం: తారిక్ రెహమాన్‌కు ప్రధాని మోదీ అభినందనలు..

బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఘనవిజయం సాధించింది. మొత్తం 299 సీట్లలో ఇప్పటివరకు 286 సీట్ల ఫలితాలు రాగా, బీఎన్‌పీ ఏకంగా 209 సీట్లను గెలుచుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 150 సీట్ల కంటే ఈ మెజారిటీ చాలా ఎక్కువ.

అయితే  జమాతే ఇ ఇస్లామి నేతృత్వంలోని 11 పార్టీల కూటమికి 70 సీట్లు వచ్చాయి. ఆ పార్టీ ముఖ్య నేత షఫీకర్ రెహమాన్ ఢాకా-15 నుండి గెలిచారు. దింతో  2008 నుండి 2024 వరకు సాగిన షేక్ హసీనా (అవామీ లీగ్) పాలన ముగిసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత బీఎన్‌పీ మళ్ళీ అధికారంలోకి వస్తోంది.

ALSO READ : ఆర్టీఐ దరఖాస్తుల రిజెక్షన్లలో.. ఢిల్లీ హైకోర్టు టాప్

మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు, బీఎన్‌పీ అధ్యక్షుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ కాబోయే ప్రధాని కాబోతున్నారు. ఆయన రెండు చోట్ల పోటీ చేసి రెండింటిలోనూ గెలిచారు. 17 ఏళ్ల తర్వాత గత డిసెంబర్‌లోనే ఆయన తిరిగి సొంత దేశానికి వచ్చారు.

 బంగ్లాదేశ్‌లో గత 35 ఏళ్లుగా షేక్ హసీనా లేదా ఖలీదా జియా మాత్రమే ప్రధానులుగా ఉంటూ వచ్చారు. 1988 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక పురుషుడు ప్రధాని పదవిని చేపట్టబోతున్నారు. భారీ విజయం సాధించిన తారిక్ రెహమాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే 1988లో పదవి పదవిని నిర్వహించిన చివరి పురుషుడు ఖాజీ జాఫర్ అహ్మద్, ఆ తర్వాత దేశ నాయకత్వంలో మాజీ ప్రధానులు షేక్ హసీనా, ఖలీదా జియా ఆధిపత్యం చెలాయించారు.