మాస్కో: రష్యా ప్రభుత్వం గురువారం తమ దేశంలో మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను పూర్తిగా బ్లాక్ చేసింది. సుమారు 10 కోట్ల మంది యూజర్లున్న ఈ యాప్‌ను..దేశ డొమైన్ నేమ్ సిస్టమ్ నుంచి తొలగించింది. దీంతో రష్యా యూజర్లకు వాట్సాప్ కనెక్ట్ అవ్వడం ఆగిపోయింది. రష్యా గతంలోనూ ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రాములను కూడా బ్యాన్ చేసింది. టెలిగ్రామ్, వాట్సాప్‌లపై కాల్స్ రెస్ట్రిక్ట్ చేసింది.
తాజాగా వాట్సాప్‌ను పూర్తిగా బ్లాక్ చేసింది. దీనిపై వాట్సాప్ కంపెనీ ఒక స్టేట్‌మెంట్ విడుదల చేసింది. "ఈ రోజు వాట్సాప్‌ను రష్యా ప్రభుత్వం పూర్తిగా బ్లాక్ చేసింది. యూజర్లను ప్రభుత్వ నిఘా యాప్ 'మ్యాక్స్'కు మళ్లించే ఉద్దేశంతో వాట్సాప్‌ను రష్యా పూర్తిగా నిరోధించడానికి ప్రయత్నిస్తున్నది. ఇది రష్యాలో 10 కోట్ల మంది యూజర్లను ప్రైవేట్, సెక్యూర్ కమ్యూనికేషన్ నుంచి దూరం చేయడమే. ప్రభుత్వ చర్య రష్యన్ ప్రజల భద్రతను తగ్గిస్తుంది. యూజర్లను మళ్లీ కనెక్ట్‌గా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నం" అని వాట్సాప్ పేర్కొంది.
