ఖాట్మాండు: నేపాల్‌లో మళ్లీ రాచరిక పాలన తీసుకురావాలని ఆ దేశ ప్రజలు మాజీ రాజు జ్ఞానేంద్ర షాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం రాజు జ్ఞానేంద్ర షా నేపాల్‌కు రాగా, వందలాది మంది ఆయన మద్దతుదారులు త్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చి, ఘన స్వాగతం పలికారు. దేశాన్ని కాపాడటానికి రాజు జ్ఞానేంద్ర షా మళ్లీ తిరిగి రావాలంటూ నినాదాలు చేశారు.
కాగా, త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, దాని పరిసర ప్రాంతాల్లో ఐదుగురికి మించి ప్రజలు గుమిగూడడం నిషేధం. అయితే, రాజు రాక సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ భారీ స్థాయిలో ప్రజలు, కార్యకర్తలు అక్కడికి వచ్చారు. దీంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
