ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్లకు పాత ప్రశ్నపత్రాలు

 ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్లకు పాత ప్రశ్నపత్రాలు
  • www.tgprb.in  వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో పీడీఎఫ్‌‌‌‌‌‌‌‌
  • మార్చి 29న  రెండు సెషన్స్‌‌‌‌‌‌‌‌లో పరీక్ష

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్ ట్రైనీ (టీఎస్టీ), మెకానికల్ సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్ ట్రైనీ (ఎంఎస్‌‌‌‌‌‌‌‌టీ) పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు ఊరట లభించింది. మార్చి 29న పరీక్షలు రాయనున్న అభ్యర్థులకు అవగాహన పెంచే విధంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్వహించిన రాత పరీక్షలకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలను మండలి అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సై www.tgprb.in లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు టీఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌పీఆర్‌‌‌‌‌‌‌‌బీ చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 29వ తేదీన రెండు విడతల్లో రాత పరీక్షలు జరగనున్నాయని తెలిపారు.   ఈ ఏడాది జనవరి 21న విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని  వెల్లడించారు.