లండన్‎లోని బంగ్లాదేశ్ ఎంబసీ ముందు ఉద్రిక్తత.. హిందువుల ర్యాలీని అడ్డుకున్న ప్రో ఖలిస్తాన్ సిక్కులు

లండన్‎లోని బంగ్లాదేశ్ ఎంబసీ ముందు ఉద్రిక్తత.. హిందువుల ర్యాలీని అడ్డుకున్న ప్రో ఖలిస్తాన్ సిక్కులు

లండన్: ఇంగ్లాండ్ రాజధాని లండన్‎లో హిందూ గ్రూప్ ర్యాలీని ప్రో ఖలిస్తాన్ సిక్కులు అడ్డుకున్నారు. శనివారం బంగ్లాదేశ్ ఎంబసీ బయట ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్‎లో హిందువుల హత్యలను ఖండిస్తూ హిందూ గ్రూప్‎కు చెందిన నిరసనకారులు ర్యాలీ తీశారు. బంగ్లాదేశ్ ఎంబసీ వద్దకు చేరుకుని ఆందోళన చేస్తుండగా.. ప్రో ఖలిస్తాన్  సిక్కులు అక్కడకు వచ్చి అభ్యంతరం తెలిపారు.

ఖలిస్తానీ జెండాలను ఊపుతూ భారత్‎కు, భారత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ, షహీద్ నిజ్జర్ హత్యల వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.