షాద్‌నగర్, వెలుగు: ప్రతిపాదిత సిద్ధాపూర్ డంపింగ్ యార్డును నిరసిస్తూ షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు, ఉమ్మడి కొత్తూరు, నందిగామ మండలాల ప్రజాప్రతినిధులు మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు.
తెలంగాణ తల్లి విగ్రహం వద్ద డంపింగ్ యార్డు హటావో.. సిద్ధాపూర్ బచావో అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో కొత్తూరు మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, పార్టీ మండలాల అధ్యక్షులు శేఖర్ రెడ్డి, కుమార్ గౌడ్, సర్పంచ్ కొమ్ము కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
