ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారును ఢీ కొట్టిన లారీ.. ఇద్దరు స్పాట్ డెడ్.. ముగ్గురి పరిస్థితి విషమం

ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారును ఢీ కొట్టిన లారీ.. ఇద్దరు స్పాట్ డెడ్.. ముగ్గురి పరిస్థితి విషమం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. రఘునాథపాలెం మండలం వి వెంకటయ్యపాలెం కొత్త కలెక్టరేట్ దగ్గర ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని అంజనాపురం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఢీకొన్న లారీ కొట్టింది.

ఈ దుర్ఘటనలో.. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని అంజనాపురం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లా జనగామకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. వైజాగ్ విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయాల పాలైన వారిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.