సత్తుపల్లి, వెలుగు : మహాశివరాత్రి సందర్భంగా నీలాద్రిశ్వరుడి ఆలయానికి సత్తుపల్లి నుంచి ఆదివారం 25 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సత్తుపల్లి నుంచి పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30 చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు.
వీఎం బంజరు నుంచి నీలాద్రికి, సత్తుపల్లి నుంచి అన్నపురెడ్డిపల్లి శివాలయానికి కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వివరించారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 నుంచి 16న ఉదయం 6 గంటల వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని వెల్లడించారు.
