లేబర్ కోడ్స్ కార్మికులకు శాపం : అఖిలపక్ష నాయకులు

లేబర్ కోడ్స్ కార్మికులకు శాపం : అఖిలపక్ష నాయకులు

వెలుగు నెట్​వర్క్​: సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అఖిలపక్ష నాయకులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. నాలుగు లేబర్ కోడ్స్ పాటు విద్యుత్, -విత్తన సవరణ బిల్లులు, వీబీజీ రాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్​చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఈ సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగ సంఘాలు, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతు సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ దేశంలోని కార్మికులను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్​ను తీసుకొచ్చిందని ఆరోపించారు. లేబర్ కోడ్స్​ విద్యుత్, -విత్తన సవరణ బిల్లులు, వీబీజీ రాంజీ చట్టం దేశ ప్రజల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.