- పతంగి కొనివ్వలేదని బెదిరించేందుకు ఉరేసుకున్న చిన్నారి.. చీర బిగుసుకొని మృతి
- మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం
మిడ్జిల్, వెలుగు : పతంగి కొనివ్వకపోవడంతో ఉరి వేసుకొని తల్లిదండ్రులను బెదిరించాలనుకున్న ఓ బాలుడు.. ప్రమాదవశాత్తు చీర బిగుసుకుపోవడంతో చనిపోయాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం చిలువేరు గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన జక్క రాజు శ్రీలతకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సిద్దు (9) ఉన్నాడు. సిద్ధు స్థానికంగా మూడో తరగతి చదువుతున్నాడు.
పతంగి కొనివ్వాలని సిద్దు ఆదివారం తల్లిదండ్రులను అడగడంతో వారు నిరాకరించారు. దీంతో వారిని బెదిరించాలనుకున్న సిద్దు.. ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. తర్వాత పత్తి మీదికి ఎక్కి స్లాబుకు వేలాడుతున్న చీరను మెడకు చుట్టుకున్నాడు. ఈ క్రమంలో పత్తి కిందకు జారడంతో చీర గొంతుకు బిగుసుకుపోయింది. కుటుంబ సభ్యులు గది తలుపులు పగులగొట్టి చూసే సరికే చనిపోయి కనిపించాడు.
