OTT Drama: EMIల భారంలో మిడిల్ క్లాస్ జీవితం.. రూ.కోటి ఆఫర్‌తో ఊహించని మలుపు!

OTT Drama: EMIల భారంలో మిడిల్ క్లాస్ జీవితం.. రూ.కోటి ఆఫర్‌తో ఊహించని మలుపు!

తమిళంలో వచ్చిన ఫ్యామిలీ-కామెడీ ఎంటర్ టైనర్ “మిడిల్ క్లాస్‌‌‌‌” (Middle Class). ఈ మూవీ Nov 21, 2025న థియేటర్లో విడుదలై, బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. ఇందులో కాళి వెంకట్, మునీష్‌‌‌‌కాంత్, విజయలక్ష్మి, రాధా రవి కీలక పాత్రల్లో నటించి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మూవీ జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్కి అందుబాటులో ఉంది. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది.

ఈ మిడిల్ క్లాస్ ఫిల్మ్ ఫ్యామిలీ డ్రామాని కిషోర్ ముత్తురామలింగం అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. తల్లిదండ్రులు, పిల్లలు, నెలవారీ ఖర్చులు, EMIలు, సామాజిక ఒత్తిడిని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ఫ్యామిలీ-సంబంధాలు చాలా రిలేటబుల్గా చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. హ్యూమర్ + ఎమోషన్  సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. 

కథేంటంటే: 

కార్ల్ మార్క్స్ (మునీష్​కాంత్)ది చెన్నైలో సెటిలైన ఒక మిడిల్ క్లాస్‌‌‌‌ ఫ్యామిలీ. భార్య అన్బరసి (విజయలక్ష్మి) చాలా కోపిష్టి. వాళ్లకు ఇద్దరు పిల్లలు. రోజువారీ బడ్జెట్, నెలవారీ ఈఎంఐలు, చాలీచాలని జీతం.. ఇదే వాళ్ల జీవితం. అందుకే మార్క్స్‌‌‌‌ సిటీ లైఫ్‌‌‌‌ నుంచి బయటపడాలి అనుకుంటాడు. ఎలాగైనా డబ్బు సంపాదించి సొంతూరిలో కొంత భూమి కొని, వ్యవసాయం చేయడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుంటాడు.

అయితే.. మార్క్స్‌‌‌‌ తండ్రి గతంలో ఒక రాజస్థానీ బిజినెస్‌‌‌‌మెన్‌‌‌‌కు చెన్నైలో వ్యాపారం మొదలుపెట్టేందుకు సాయం చేస్తాడు. ఆ తర్వాత చనిపోతాడు. కానీ.. ఆ బిజినెస్‌‌‌‌మెన్‌‌‌‌కి బాగా లాభాలు వస్తాయి. దాంతో అతను కృతజ్ఞతగా మార్క్స్‌‌‌‌కి రూ. కోటి బ్లాంక్ చెక్ పంపుతాడు. కానీ.. ప్రమాదవశాత్తు మార్క్స్‌‌‌‌ ఆ చెక్‌‌‌‌ని పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో సినిమా చూసి తెలుసుకోవాలి.