- కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు వజ్రేశ్యాదవ్
ఉప్పల్, వెలుగు: జిల్లా నాయకత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్యాదవ్సూచించారు. త్వరలో పార్టీ జిల్లా పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కష్టపడి పని చేసే నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు, పదవులు ఇస్తామని చెప్పారు.
ఉప్పల్ భగాయత్‌లోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం ఉప్పల్నియోజకవర్గ ఇన్చార్జి మందముల పరమేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. పీసీసీ పరిశీలకులు దుర్గం భాస్కర్, కార్పొరేటర్లు రజితారెడ్డి, బొంతు శ్రీదేవి, స్వర్ణరాజ్, నాయకులు ఆకారపు అరుణ్, బాకారం లక్ష్మణ్, రఫిక్, నాగశేషు, శెట్టి ప్రసాద్, సింగిరెడ్డి వెంకట్‌రెడ్డి, పోలేపాక అంజయ్య, సాయికిరణ్, బండారి శ్రీకాంత్, రాజేశ్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
