మైనార్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: స్టేట్‌ మైనార్టీస్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్‌

మైనార్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: స్టేట్‌ మైనార్టీస్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్‌

హసన్ పర్తి, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం వెంటనే మైనార్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని స్టేట్‌ మైనార్టీస్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్‌ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో స్టేట్‌ మైనార్టీస్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్‌ హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్‌ నన్నెసాహెబ్‌,  ప్రధాన కార్యదర్శిగా జహీర్ అహ్మద్ బేగ్, ఐదుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

 మైనార్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న విద్య, ఉపాధి, ప్రమోషన్లు, సంక్షేమ పథకాల అమలు వంటి ప్రధాన సమస్యలపై చర్చించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జహీర్ అహ్మద్ బేగ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ ఫారూఖ్, అహ్మద్ సాహెబ్ కు  కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ మాట్లాడుతూ ఉద్యోగ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.