జనగామ/ జనగామ అర్బన్, వెలుగు: మున్సిపాలిటీ అభివృద్ధి కృషి చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి తమ వంతుగా సహకరిస్తామని తెలిపారు.
అనంతరం వికాస్ ఫార్మసీ కాలేజ్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమానికి వారు హాజరై 419 మంది కల్లుగీత కార్మికులకు కిట్లను అందజేశారు. కాగా, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ చిటుకుల అంజయ్యను ఎంపీ చామల పరామర్శించారు.
