ఇజ్రాయెల్, అమెరికా.. ఇరాన్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులకు ప్రతిస్పందనంగా ఇరాన్ ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది.
ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. ‘‘టెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడి తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ వైపు క్షిపణులు ప్రయోగించింది” అని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్ దాదాపు 35 మిస్సైళ్లు ప్రయోగించినట్లు సమాచారం.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు కౌంటర్‌గా ఇరాన్ కూడా రివేంజ్ ఎటాక్స్ మొదలు పెట్టడంతో మిడిల్ ఈస్ట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు.. ఇరాన్, ఇజ్రాయెల్ దేశ పౌరులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కబిక్కు మంటున్నారు.
ఏ క్షణాన ఏ బాంబు, ఏ మిస్సైల్ వచ్చి మీద పడుతుందోనని గజగజ వణికిపోతున్నారు. యుద్ధం ప్రారంభం కావడంతో ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలు ఎమర్జెన్సీ ప్రకటించాయి. రెండు దేశాల తమ ఎయిర్ స్పేస్ ను క్లోజ్ చేశాయి.
ఇక ఇజ్రాయెల్ దేశం మొత్తం స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నింటిని మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు అన్నింటిని మూసివేసి.. సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ప్రజలు ఎవరూ రోడ్లపైకి రావొద్దని ఆదేశించింది ఇజ్రాయెల్ సర్కార్. జనం అంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచించింది. అత్యవసర సేవల కోసం బయటకు వచ్చినవాళ్లు.. ఏమైనా అనుమానం ఉన్నా.. దాడులు జరిగే ప్రమాదం ఉందని గ్రహించినా.. వెంటనే సమీపంలోని బంకర్లలోకి వెళ్లాలంటూ సైరన్లు మోగించింది ఇజ్రాయెల్ ప్రభుత్వం.
►ALSO READ | లొంగిపోండి లేదా చచ్చిపోండి : ఇరాన్ కు ట్రంప్ మాస్ వార్నింగ్
