అందరు కలిసి చూసే మ్యాచ్ క్రికెట్ ఒక్కటేనని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ప్రతాపసింగారంలో స్పాట్ లైట్ క్రికెట్ గ్రౌండ్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..విద్యతో పాటు స్పోర్ట్స్ అవసరమన్నారు. టీవీచూడటం, సోషల్ మీడియాను వాడటం పక్కన పెట్టి క్రికెట్ నేర్చుకోవాలని సూచించారు .
ఈ సందర్బంగా.. నర్సింహారెడ్డిని క్రికెట్ లో 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా. వాళ్ళ అబ్బాయి రంజిత్ క్రికెట్ ప్లేయర్ . ఇక్కడ చాలా మంచి గ్రౌండ్ ఏర్పాటు చేశారు. నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు సిటీ సరౌండింగ్ లో క్రికెట్ గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలనుకున్నా. నేను మారు మూల ప్రాంతాల్లో క్రికెట్ డెవలప్ చేయాలనుకున్నా. ఇటీవలే కాకా పేరుతో క్రికెట్ టోర్నీ నిర్వహించా. క్రికెట్ లో చాలా మార్పులు జరుగుతున్నాయి. సుప్రీం కోర్టు కూడా 15% కంటే ఎక్కువ క్రికెట్ పాసెస్ ఇవ్వొద్దని చెప్పింది. నేను ఉండే ప్రాంతం మొయినాబాద్ లో కూడా క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేశాను. చాలా మంది వచ్చి అడుతున్నారు. క్రికెట్ అంటే చాలా మందికి పిచ్చి ఉంటుంది. నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో స్కూటర్ మీద పోయి క్రికెట్ అడేవాన్ని . ఇక్కడ చాలా మంది మంచి కొచ్ లు ఉన్నారు . గ్రామీణ ప్రాంతం వారికి ఉపయోగం పడుతుంది అని వివేక్ అన్నారు
