వైకుంఠ ఏకాదశి కి మట్టపల్లి ఆలయం ముస్తాబు

వైకుంఠ ఏకాదశి కి  మట్టపల్లి ఆలయం ముస్తాబు

మఠంపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న వైకుంఠ ఏకాదశికి ముస్తాబయింది.  పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుని ప్రత్యేక పూజలు పాల్గొంటారు.  భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఆలయ పాలకమండలి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్టీసీ అదనపు బస్సులను నడిపేందుకు రెవెన్యూ పోలీస్ శాఖ ఏర్పాట్లు చేశారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాలకు వేదమంత్ర పఠనం, హరికథ తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను దేవస్థానం ఏర్పాటు చేసింది.