తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యారు. 2025, డిసెంబర్ 29వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సభ ప్రారంభం అయ్యింది. సభకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వస్తారా లేదా అనే చర్చకు తెరదించుతూ.. కేసీఆర్ సభకు హాజరయ్యారు.
మొదటి రోజు సభకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అటెండ్ అయ్యారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం నిధులు, నీళ్లలో ఎంత నష్టపోయింది అనేది ప్రభుత్వం సభలో వివరించనున్నది.
కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ సభకు హాజరయ్యారు. కేసీఆర్ రాకతో సభ్యులు అందరూ అటెండ్ అయ్యారు. సభకు వచ్చే ముందు.. అమరవీరుల స్తూపం దగ్గర అమరులకు నివాళులు అర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
