ఇండియా తరఫున మ్యాచ్‌ ఆడిన పాక్‌‌‌‌‌‌‌‌‌‌ కబడ్డీ ప్లేయర్‌‎పై బ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇండియా తరఫున మ్యాచ్‌ ఆడిన పాక్‌‌‌‌‌‌‌‌‌‌ కబడ్డీ ప్లేయర్‌‎పై బ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కరాచీ: ఇండియాకు చెందిన ఓ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫున కబడ్డీ ఆడిన పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉబైదుల్లా రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆ దేశ సమాఖ్య నిషేధం విధించింది. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదటి వారంలో బహ్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేదికగా ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కబడ్డీ టోర్నీ జరిగింది. అందులో ఉబైదుల్లా ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫున బరిలోకి దిగాడు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచిన తర్వాత ఇండియా జెండాను తన భుజాల చుట్టు ధరించడం సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. 

ప్లేయర్లు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ఆడటం సహజమే అయినా... రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంశం పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కబడ్డీ సమాఖ్య (పీకేఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)కు తీవ్రంగా కోపం తెప్పించింది. అత్యవసరంగా భేటీ అయిన సమాఖ్య రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిషేధం విధిస్తూ కఠిన చర్యలు తీసుకుంది. ఈ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ ముందు అప్పీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునే హక్కు ఉబైదుల్లాకు ఉందని వెల్లడించాడు.