న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలన్న ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కామెంట్లకు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ మద్దతు తెలిపారు. బీజేపీ ప్రభుత్వంపై పోరాడేందుకు, అధికారం నుంచి ఆ పార్టీని దించేందుకు ఇది చాలా అవసరమని దిగ్విజయ్ శనివారం పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నించిన మీడియాకు జవాబిస్తూ శశి థరూర్.. ‘‘కాంగ్రెస్ పార్టీని రూట్ లెవల్‌లో బలోపేతం చేయాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నేను, దిగ్విజయ్ సింగ్ మంచి స్నేహితులం” అని పేర్కొన్నారు.
