26 వేల వెబ్ సైట్లు హ్యాక్

26 వేల వెబ్ సైట్లు హ్యాక్
  • రాజ్యసభలో కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో కిందటేడాది 26 వేల వెబ్ సైట్ లు హ్యాక్ అయ్యాయని కేంద్రం వెల్లడించింది. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సైట్లు కూడా ఉన్నాయని చెప్పింది. గురువారం రాజ్యసభలో ఈ వివరాలను కేంద్ర మంత్రి సంజయ్ ధోత్రే వెల్లడించారు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) డేటా ప్రకారం 2018లో 110, 2019లో 54, 2020లో 59 గవర్నమెంట్ సైట్లు హ్యాక్ చేశారని తెలిపారు.