సుక్మాలో 38 మంది కోబ్రా జవాన్లకు కరోనా పాజిటివ్

సుక్మాలో 38 మంది కోబ్రా జవాన్లకు కరోనా పాజిటివ్

దేశంలో  పెరుగుతున్న కరోనా కేసుల తోపాటు .. కొత్త వేరియంట్లు కూడా తోడు కావటంతో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వీటి బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నారు.  వైరస్ ప్రభావం సైన్యం మీద కూడా పడింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లాలో 38 మంది CRPFవిభాగానికి చెందిన కోబ్రా జవాన్లు కరోనా బారినపడ్డారు. CRPFలోని ఎలైట్ వింగ్ అయిన కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) 202వ బెటాలియన్‌కు చెందిన సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు.

దీంతో వీరందరినీ క్యాంపులోనే క్వారంటైన్‌ చేసామని అధికారులు తెలిపారు. 202 బెటాలియన్‌కు చెందినకోబ్రా అనేది సీఆర్‌పీఎఫ్‌లో ఓ విభాగమని, తెమెల్వాడాలో క్యాంపులో విధుల కోసం దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఆదివారం (జనవరి 2,2022)సుక్మాకు వచ్చారని తెలిపారు. కొవిడ్‌ ప్రోటోకాల్స్‌లో భాగంగా 75 మందికి యాంటీజన్‌ పరీక్షలు నిర్వహించగా.. 38 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సుక్మా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సీవీ బన్సోడ్‌ తెలిపారు. వారి స్వాబ్‌తో కూడిన శాంపిల్స్‌ని ఆర్టీ- పీసీఆర్‌ పరీక్షల కోసం జగదల్‌పూర్‌కు పంపామన్నారు. వారికి పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో వారితో కాంటాక్ట్ అయినవారిని గుర్తిస్తున్నామన్నారు.

 

మరిన్ని వార్తల కోసం..

శుక్రవారం రాత్రి నుంచి సోమవారం వరకు కర్ఫ్యూ