రియాకు కండీషనల్ బెయిల్.. ఆ ఐదు షరతులివే

రియాకు కండీషనల్ బెయిల్.. ఆ ఐదు షరతులివే

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ కేసులో డ్రగ్స్ ఆరోపణలతో అరెస్టయిన రియా చక్రవర్తి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. గత నెలలో ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే. తాజాగా రియాకు పలు షరతులతో కూడిన బెయిల్‌‌ను మంజూరు చేస్తూ ముంబై హైకోర్టు ఆమెను విడుదల చేసింది. అయితే రియా సోదరుడు షోవిక్ బెయిల్ పిటిషన్‌‌ను మాత్రం కోర్టు తోసిపుచ్చింది.

రియాకు కోర్టు విధించిన ఆ ఐదు కండీషన్స్ ఇవే:
1. రియా తన పాస్‌‌పోర్ట్‌‌‌ను అప్పగించాలి.
2. పది రోజుల వరకు రియా ప్రతి రోజూ ముంబై పోలీసులకు రిపోర్ట్ చేయాలి.
3. బెయిల్ బాండ్‌‌కు రియా రూ.లక్ష చెల్లించాలి.
4. రియా దేశాన్ని విడిచి వెళ్లడానికి వీల్లేదు.
5. మిగతా సాక్షులను కలవడానికి రియాకు అనుమతి లేదు.