చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలి

చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలి

వ్యవసాయచట్టాలను రద్దు చేస్తూ.. నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ. చట్టాలు రద్దు చేయాలంటూ జరిగిన పోరాటంలో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు వరుణ్ గాంధీ. రద్దు నిర్ణయం ముందే తీసుకుని ఉంటే 700 మంది జీవించి ఉండేవారన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో రైతులను వేధించేందుకు కేసులు పెట్టారని.. వాటన్నింటిని రద్దు చేయాలన్నారు వరుణ్ గాంధీ. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. కీలక స్థానాల్లో ఉన్న నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడారని.. ఇది ఉద్రిక్తతలకు కారణమైందని ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించారు వరుణ్ గాంధీ. లఖీంపూర్ ఖేరీలో  ఐదుగురు రైతులను తొక్కించి చంపడానికి కూడా ఇదే కారణమైందన్నారు. రాజ్యాంగబద్ధమైన విధానాల ద్వారా, సామరస్య పూర్వకంగా సమస్య పరిష్కరించాలని రైతులు కోరుకుంటున్నారని చెప్పారు. వరుణ్ గాంధీ.