
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల నగరా మోగుతుంది. దేశ రాజకీయం సంగతి అటు ఉంచితే..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే..నేడు సోమవారం (మే13న)..25 ఎంపీ,175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ ఉదయం 7 గంటల ఉంచే పోలింగ్ షురూ అయింది. తమ అమూల్యమైన ఓటుని వినియోగించుకోవడానికి సామాన్య ప్రజలతో పాటుగా సినీ సెలబ్రెటీలు తమ ఓటు హక్కుని వినియోగించుకుని సోషల్ మీడియాలో తమ సందేశాన్ని తెలియజేస్తున్నారు.
అందులో భాగంగా గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, తన భార్య, తల్లితో కలిసి జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్నాడు..బ్లూ షర్ట్, స్టయిలిష్ గ్లాసెస్ పెట్టుకుని లైన్ లో నిలుచుని ఓటుని వేశాడు."ఓటు మీ వజ్రాయుధం..ఓటు మీ హక్కు " అని తెలిపారు.
అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని బీఎస్ఏన్ఎల్ సెంటర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.."ప్రతి ఒకరు తమ ఓటుని వినియోగించుకోవాలని కోరాడు. ఇక ట్విట్టర్ లో ఓటు వేసినట్లు పోస్ట్ చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి ఓటు వేసి పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తూ మీడియాతో మాట్లాడుతూ.."గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను గుర్తు చేసుకున్నారు."లాస్ట్‌టైమ్ మౌనవ్రతం అని చెప్పాననుకుంటా’ అంటూ నవ్వులు పంచారు. ‘‘ఇవాళ మా కుటుంబమంతా ఓటేసింది. ఓటు మన హక్కు మాత్రమే కాదు..అది మన బాధ్యత. అది మన రాష్ట్ర, దేశ రూపురేఖలను మార్చేస్తుంది. మనకు సుపరిపాలన అందిస్తారనే నమ్మకం ఉన్న అభ్యర్థులను ఎన్నుకోండి’’ అని తమ సందేశాన్ని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో చిరు ఓటు వేశారు.
పవన్ కళ్యాణ్ లు తమ భార్యతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సతీసమేతంగా మంగళగిరి చేరుకున్న పవన్ కళ్యాణ్..గిరిజన సహకార సంస్థ పోలింగ్ కేంద్రం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రాజమౌళి కూడా తన భార్య,కొడుకుతో కలిసి షేక్ పేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.అంతేగాకుండా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న కూడా దుబాయ్ నుంచి వచ్చి మరీ ఓటు వేశాడు.అలాగే ఒక విలువైన సందేశాన్ని కూడా ప్రజలతో షేర్ చేసుకున్నారు.
‘‘గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. అది మనకు మంచిది కాదు. బాధ్యతాయుత పౌరులమని దేశానికి చాటి చెప్పండి. రండి.. ఓటెయ్యండి’’ అని దర్శకుడు రాజమౌళి విజ్ఞప్తి చేశారు. షేక్‌పేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. "
Flew from Dubai… Rushed to the polling booth directly from the airport, hence the tired looks..?
— rajamouli ss (@ssrajamouli) May 13, 2024
Done!
YOU? pic.twitter.com/kQUwa1ADG6
డైరెక్టర్ రాఘవేంద్ర రావు, సందీప్ కిషన్ లు కూడా ప్రజలతో పాటు ఓటు హక్కును వినియోంచుకున్నారు.అలాగే హీరో నాగ చైతన్య తన ఓటుని ఉమెన్ కోపేరేటివ్ డవలప్ మెంట్ కార్పొరేషన్ కేంద్రం లో వినియోగించుకున్నాడు..అదే విధంగా నందమూరి బాలకృష్ణ తన భార్యతో కలిసి హిందూపూర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సొంత గ్రామంలో ఓటు వేశాడు.తెలంగాణ లోక్ సభ ఎన్నికలతో పాటుగా కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు ప్రారంభం అయ్యిన విషయం తెలిసిందే.
CAST YOUR VOTE ?? pic.twitter.com/QHlQfRQ75P
— Allu Arjun (@alluarjun) May 13, 2024