బాధ్యత అంటే ఇదీ : పెళ్లి బట్టల్లో ఓటు వేసిన పెళ్లి కొడుకు

బాధ్యత అంటే ఇదీ : పెళ్లి బట్టల్లో ఓటు వేసిన పెళ్లి కొడుకు

మరికాసేపట్లో పెళ్లి చేసుకోబుతున్నాడు.  అయినా సరే ఓటే ముఖ్యమనుకున్నాడు.  పెళ్లి కొడుకు గెటప్​ లో  ఓ వ్యక్తి పోలింగ్​కేంద్రానికి వచ్చాడు.   శ్రీనగర్​ లోక్​సభ నియోజకవర్గంలోని గందర్​బల్​ పట్టణంలోని పోలింగ్​స్టేషన్​ ఓ పెళ్లికొడుకు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.. ఓటు వేయడం ప్రతి పౌరుడి విధి అని, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని వివరించారు

ఉద్యోగాల కల్పనకు, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి దోహదపడే వారిని నమ్మే అభ్యర్థికి తాను ఓటు వేశానని చెప్పి.. అందరికి ఆదర్శంగా నిలిచాడు పెళ్లికొడుకు ఓటర్​. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.