మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే.. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు వేస్తాం అని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. 2026, ఫిబ్రవరి 4వ తేదీన మిర్యాలగూడలో పర్యటించారు సీఎం. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన తర్వాత.. బహిరంగ సభలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఈ రెండేళ్లలోనే రైతుల కోసం లక్షా 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారాయన. 25 లక్షల 30 వేల మంది రైతులకు.. 21 వేల కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేశామని.. అప్పల నుంచి రైతులను విముక్తి చేసినట్లు చెప్పుకొచ్చారాయన.
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన వెంటనే.. రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని ప్రకటించారాయన. దీని కోసం 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని.. ఈ 9 వేల కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లో నేరుగా వేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. వరి పంట వేస్తే ఉరే అని కేసీఆర్ ఎక్కడ.. వరి పండిస్తే గిట్టుబాటు ధరతోపాటు 500 రూపాయల బోనస్ ప్రకటించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తూ.. 3 కోట్ల 15 లక్షల మందికి లబ్ధి చేకూర్చామని.. వరి పంట అంటే రైతులకు ఉరి కాదు.. పండుగగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని.. మిర్యాలగూడ సభనే ఇందుకు సాక్ష్యం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
