గౌహటి: అస్సాం గౌహటిలోని పంజాబరి ప్రాంతంలోని ఒక ఇంట్లో దారుణ ఘటన వెలుగుచూసింది. చిన్న పిల్లలను పనిలో పెట్టుకోకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒక కుటుంబం అమానుషంగా ప్రవర్తించింది. 13 ఏళ్ల చిన్నారిని ఆరేళ్లుకు ఇంట్లో పనిమనిషిగా మాట్లాడుకుని.. ఆ పాపతో వెట్టి చాకిరి చేయించుకుంది. ఈ కుటుంబం ప్రవర్తించిన తీరుపై అధికారులకు ఫిర్యాదు అందింది.
ఇంటికి అధికారులు, పోలీసులు వస్తున్న సంగతి ముందే పసిగట్టిన సదరు కుటుంబం ఆ చిన్నారిని మంచం బెడ్ కింద ఉన్న ర్యాక్లో దాచేసింది. ఏమాత్రం అనుమానం రాకుండా బెడ్ పైన ఇంటి యజమాని ఇంట్లో పిల్లాడిని దుప్పటి కప్పి మరీ పడుకోబెట్టారు. అధికారులు ఆ బెడ్ పైకి లేపి చూడగా ర్యాక్లో బిక్కుబిక్కుమంటూ చిన్నారి కనిపించింది.
ALSO READ : తాగి నడుపుతూ 11వ సారి పోలీసులకు దొరికాడు..
ర్యాక్ కిందనే ఆ పాప 25 నిమిషాల పాటు గాలి, వెలుతురు కూడా సరిగా లేని స్థితిలో గడిపింది. డిస్ట్రిక్ట్ లేబర్ టాస్క్ ఫోర్స్ మేజిస్ట్రేట్ ఈ కుటుంబ నిర్వాకాన్ని కళ్లారా చూశారు. అమీన్ అక్తర్ లష్కర్ (House No. 69, Juripar) ఇంట్లో ఈ ఘటన జరిగింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆదివారం సాయంత్రం తనిఖీలు చేయగా ఈ కుటుంబ ఆకృత్యం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అధికారులు ఈ దారుణానికి పాల్పడిన కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా ప్రయత్నిస్తుంటే ఇవేవీ పట్టనట్టుగా కొందరు యజమానులు చిన్నారులతో ఇలా వెట్టి చాకిరి చేయిస్తుండటం గమనార్హం.
ALSO READ : ఆవు మూత్రం తాగితే క్యాన్సర్ నయమవుతుందా..?
A 13-year-old girl was rescued from horrific abuse in Panjabari after being found locked inside a divan storage box. The District Labour Task Force, with a magistrate present, raided the house of Amrin Akhtar Laskar (House No. 69, Juripar) on Sunday evening following local… pic.twitter.com/RUAkMl433K
— Ron Bikash Gaurav (@RonBikashGaurav) February 3, 2026
