అన్నీ ఇంట్లోనే : రోడ్లపై ఈ 21 పనులు చేస్తే భారీ జరిమానాలు.. ఫుల్ లిస్ట్ ఇదే..

అన్నీ ఇంట్లోనే : రోడ్లపై ఈ 21 పనులు చేస్తే భారీ జరిమానాలు.. ఫుల్ లిస్ట్ ఇదే..

ముంబై సిటీ.. దేశ ఆర్థిక రాజధాని.. పేరుకు తగ్గట్టు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలా లేదా.. ఉండాలి.. లేకపోతే తిరిగే జనమే కాదు.. సిటీ చూడటానికి వచ్చే టూరిస్టులు, విదేశీయులు ఇదేం సిటీ అంటూ నవ్వుతారు. ప్రస్తుతం ముంబై సిటీకి పరిశుభ్రమైన నగరంగా మార్చాలని నిర్ణయానికి వచ్చిన ముంబై కార్పొరేషన్.. రోడ్లపై చేసే పనులకు భారీ జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరించింది. 21 రకాల పనులు రోడ్లపై చేయకూడదని.. చేస్తే తాట తీస్తామని.. జరిమానాలతో జేబులు ఖాళీ చేస్తామని వార్నింగ్ ఇస్తుంది. 

ఎలాంటి పనికి.. ఎంతెంత జరిమానా..? :

>>> బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయటం.. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మితే 250 రూపాయల ఫైన్
>>> రోడ్లు, ఫుట్ పాత్ లు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే 500 రూపాయల జరిమానా
>>> చిన్న హోటళ్లు, రోడ్ సైడ్ దుకాణదారులు రోడ్లపై బట్టలు ఉతకటం, రోడ్లపై పాత్రలు తోమటం వంటి పనులు చేస్తే 300 రూపాయల జరిమానా
>>> పబ్లిక్ ప్లేసుల్లో.. రోడ్లపై బైక్స్, కార్లు, బస్సులు, ఆటోలు కడిగితే 500 రూపాయల ఫైన్
>>> బహిరంగ ప్రదేశాల్లో జంతువులు, పక్షులకు ఆహారం పెడితే 500 రూపాయల జరిమానా
>>> బహిరంగ ప్రదేశాల్లో.. రోడ్లపై స్నానం చేసినా.. పార్కుల్లో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ ఆవరణల్లో స్నానం చేస్తే 300 రూపాయల జరిమానా
>>> రోడ్డు పక్కన మల, మూత్ర విసర్జన చేస్తే 500 రూపాయల ఫైన్
>>> తడి, పొడి చెత్త వేరు చేయకుండా చెత్త సేకరణ వాహనాలు, డబ్బాల్లో వేస్తే ఆ కుటుంబానికి 200 రూపాయల జరిమానా
>>> పొడి చెత్తను విడిగా ఇవ్వకపోయినా అలాంటి కుటుంబానికి లేదా వ్యక్తులకు 200 రూపాయల ఫైన్.
>>> పెద్ద మొత్తంలో చెత్త ఉత్పత్తి చేసే వారు.. అంటే హోటళ్లు, రెస్టారెంట్లు, ఆఫీసుల వారు చెత్త సేకరణ కింద వెయ్యి రూపాయలు చెల్లించాలి. 
>>> కూరగాయల షాపులు, వెజ్, ఫ్రూట్ మార్కెట్లు, ఇతర చిన్న వ్యాపారులు చెత్త డబ్బాలు పెట్టకపోయినా.. చెత్త డబ్బాల్లో తడి, పొడి చెత్త వేరు చేయకపోయినా 750 రూపాయల ఫైన్
>>> మటన్, చికెన్ షాపులు, చేపల షాపులు వ్యాపారులు రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే 750 రూపాయల జరిమానా. 
>>> నిర్మాణ వ్యర్థాలు అంటే రెనోవేషన్ కింద తొలగించిన ఇటుక, ఐరన్, డస్ట్, ఇంటీరియల్ వేస్ట్ వంటి వాటిని బహిరంగ ప్రదేశాల్లో వేస్తే 20 వేల రూపాయల జరిమానా. 
>>> పర్మీషన్ లేని వాహనాల్లో ఇంటి నిర్మాణ వ్యర్థాలను తరలించి.. అనధికార ప్రదేశాల్లో పారపోస్తే 25 వేల రూపాయల ఫైన్.
>>> అనుమతి లేకుండా చెత్తను కాల్చితే 10 వేల రూపాయల జరిమానా.
>>> ఇళ్లల్లో శుభ్రం చేసిన నీటిని రోడ్లపైకి వదిలితే 500 నుంచి వెయ్యి రూపాయల వరకు ఫైన్..

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు ఇవి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.. నిబంధనలు ఎన్నో ఏళ్లుగా ఉన్నా.. ఇప్పుడు కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అదే విధంగా జరిమానాలను భారీగా పెంచింది. ప్రపంచంలోనే పరిశుభ్రమైన నగరం ముంబై అనే పేరు కోసం.. నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని మరీ మరీ చెబుతోంది ముంబై మున్సిపల్ కార్పొరేషన్. చూడాలి.. ఈ నిబంధనలను జనం ఎంత వరకు ఫాలో అవుతారో.. ఎంతగా భయపడతారో అనేది.. వెయిట్ అండ్ సీ...