
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతి ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలను cbse.nic.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో రోల్ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేస్తే ఫలితాలు వస్తాయి. 10వ తరగతిలో 93.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా... 12వ తరగతిలో ఏడాది 87.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 0.48 శాతం పెరిగిందని సీబీఎస్‌ఈ వెల్లడించింది. ఈ ఫలితాల్లో బాలురు కంటే బాలికలే సత్తా చాటారు. కేరళలోని తిరువనంతపురం 99.75 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, విజయవాడ 99.60 , చెన్నై 99.30 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 10వ తరగతి పరీక్షలు 2024 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వరకు నిర్వహించారు, ఇందులో 2,238,827 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా.. వీరిలో 20,95,467 మంది ఉత్తీర్ణత సాధించారు.
- త్రివేండ్రం: 99.75 శాతం
- విజయవాడ: 99.60 శాతం
- చెన్నై: 99.30 శాతం
- బెంగళూరు: 99.26 శాతం
- అజ్మీర్: 97.10 శాతం
- పుణె: 96.46 శాతం
- ఢిల్లీ వెస్ట్: 94.18 శాతం
- ఢిల్లీ ఈస్ట్: 94.45 శాతం
- చండీగఢ్: 94.14 శాతం
- పాట్నా: 92.91 శాతం
- ప్రయాగ్‌రాజ్: 92.72 శాతం
- పంచకుల: 92.16 శాతం
- భువనేశ్వర్: 92.03 శాతం
- డెహ్రాడూన్: 90.97 శాతం
- భోపాల్: 90.97 శాతం
- నోయిడా: 90.46 శాతం
- గౌహతి: 77.94 శాతం