కల్వకుర్తి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. కాంగ్రెస్  ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో పార్టీ జెండా ఎగుర వేసి కాంగ్రెస్  హయాంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. 

అనంతరం కల్వకుర్తి మున్సిపాలిటీలో రూ.6.5 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో బాలాజీ సింగ్, ఆనంద్ కుమార్, మున్సిపల్  కమిషనర్  మహమూద్  షేక్, ఏఈ షబ్బీర్  అహ్మద్  పాల్గొన్నారు.