హైదరాబాద్, వెలుగు: బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల అంతర్జాతీయ సమ్మేళనం ‘బిట్సా గ్లోబల్ మీట్ (బీజీఎం) 2026 పోస్టర్‌ను బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజీఎం 2026 చైర్‌పర్సన్ అనిత సాకురు, సీఈఓ మయూర్ పట్నాల పాల్గొన్నారు. వచ్చే నెల 9-–11లో హైదరాబాద్‌లో జరగనున్న ఈ సమ్మేళనంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పరిశోధకులు, విధాన నిర్ణేతలు సహా వెయ్యి మందికి పైగా గ్లోబల్ లీడర్లు పాల్గొననున్నారు.
జనవరి 9న తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సదస్సును ప్రారంభించనున్నారు. జనవరి 10న శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా, బిట్స్ పిలానీ ఛాన్సలర్ కుమార్ మంగళం బిర్లా ముఖ్య వక్తగా, యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అమితాబ్ చౌదరి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరుకానున్నారు. ఈ ఈవెంట్‌లో ఇన్నోవేషన్స్, లీడర్‌షిప్ వంటి అంశాలపై ఫోకస్ ఉంటుంది.
