న్యూఢిల్లీ: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఛార్జింగ్‌పాయింట్లు 2025లో భారీగా పెరిగాయి. ఫేమ్2 పథకం కింద 8,932 స్టేషన్లు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ డేటా ప్రకారం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్వంతంగా 18,500 స్టేషన్లు ఏర్పాటు చేశాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 27,432 ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి పెట్రోల్ బంకుల వద్ద ఉండటం వలన బండ్లకు ఛార్జింగ్ పెట్టడం మరింత ఈజీగా మారింది.
2024–29 మధ్య 4 వేల ఎనర్జీ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో పెట్రోల్, డీజిల్‌తో పాటు బయోఫ్యూయల్స్, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, ఈవీ ఛార్జింగ్ సదుపాయాలు ఉంటాయి. నవంబర్ 2025 నాటికి 1,064 ఎనర్జీ స్టేషన్లు సిద్ధమయ్యాయి. ట్రక్కుల కోసం “అప్నా ఘర్” ప్రాజెక్ట్ కింద 500 విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
=========================================================================
