మెదక్టౌన్, వెలుగు: కాంగ్రెస్, వామపక్షాల పొత్తులో భాగంగా పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా తొలగించాలని చూస్తోందని సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం మెదక్ జిల్లా కార్యదర్శులు ఎ. మల్లేశం, కె. మల్లేశం అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవనంలో వారి సంఘాల ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జిల్లాలో జీపు జాత నిర్వహిస్తున్నామన్నారు. ఈ యాత్రను ప్రజలు, కార్మికులు ఆదరించి మండల కేంద్రంలో జరిగే సభల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బాలమణి, నర్సమ్మ, ఉపాధ్యక్షుడు నాగరాజు, మహేందర్ రెడ్డి, బస్వరాజు, సహాయ కార్యదర్శులు సంతోష్, గౌరయ్య, రాములు, శ్రీదేవి పాల్గొన్నారు.
