చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు : సీఐలు వాసుదేవరావు, ఉపేందర్

చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు : సీఐలు వాసుదేవరావు, ఉపేందర్

సిద్దిపేట రూరల్, వెలుగు: చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐలు వాసుదేవరావు, ఉపేందర్  హెచ్చరించారు. ఆదివారం పట్టణంలో గాలిపటాలు, మాంజా విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 

వారు మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమించి చైనా మాంజా విక్రయాలు జరిపితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు.