
ఉప్పల్లో విషాదం చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందింది. భరత్ నగర్ కి చెందిన విజయలక్ష్మి అనే మహిళ లోక్సభ ఎన్నికల వేళ ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో పోలింగ్ స్టేషన్ లోనే పడిపోయింది. దీంతో వెంటనే ఆమెను స్థానిక హాస్పిటల్ కి తరలించారు పోలింగ్ సిబ్బంది,స్థానికులు. అయితే అప్పటికే ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లుగా వైద్యులు నిర్థారించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.38 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. హైదరాబాద్ లో 19. 37%, మల్కాజిగిరిలో 27. 69%, సికింద్రాబాద్ లో 24.91%, చేవెళ్ల34.56%, పెద్దపల్లిలో 45.12%, మహబూబాబాద్ లో 48.81%, నిజామాబాద్ లో 45.67%, పోలింగ్ నమోదైంది.