కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ తో జరుగుతున్న ఫస్ట్ టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 రన్స్ చేసింది. విండీస్ ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ కోల్పోయినప్పటికీ నికోలస్ పూరన్ (61) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఛాలెంజింగ్ స్కోర్ వచ్చింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా..భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, చాహల్ తలో వికెట్ తీశారు.
A few big hits in the end from Kieron Pollard helps West Indies set a target of 158 ?
— ICC (@ICC) February 16, 2022
Can India chase it down?#INDvWI | ?: https://t.co/3ipGZj7Ty1 pic.twitter.com/nEWSQCsxY1

